తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి మూడు మహా సంకల్పాలు ఎన్టీఆర్ వే!

ఎన్ టి ఆర్ దార్శనికతకు,రాయలసీమ రైతాంగం పట్ల ఆయనకున్న మమకారానికి నిలువెత్తు సాక్ష్యాలు.ఎన్టీఆర్ ఆలోచనల నుంచే పుట్టిన మూడు మహా సంకల్పాలు తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి.ఇవికేవలం సాగునీటి ప్రాజెక్టులు కాదు రాయలసీమ ప్రజల జీవన చరిత్రలో కొత్త అధ్యాయం.నేడు ఈ మూడు ప్రాజెక్టులు రాయలసీమ రాత మారుస్తున్నాయి.తెలుగు నేలపై ఎన్టీఆర్ పాలన అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం నిర్మించ తలపెట్టిన అద్భుత జలవనరులు పునాది అయ్యాయి. దశాబ్దాలుగా కరువు కోరల్లో విల-విల లాడిన రాయలసీమను రతనాల సీమ గా మార్చాలన్న పట్టుదలతో,అసాధ్యమని భావించిన చోట సుసాధ్యం చేసిన మహాత్కార్యం అది. హంద్రీ-నీవా కరువుపై ఎక్కుపెట్టిన అతి పెద్ద బాణం.కృష్ణా నది జలాలను రాయలసీమలోని ఎత్తైన ప్రాంతాలకు తరలించడం ఒక ఇంజనీరింగ్ కే సవాలు. దీనిని స్వీకరిస్తూ నలభై ఏళ్లనాడే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేయ్యడం గర్వకారణం. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లోని సుమారు 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు మరియు 33 లక్షల మందికి తాగునీరు అందించడం. శ్రీశైలం రిజర్వాయర్ వెనుక జలాల నుంచి 40 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించడం దీని ప్రత్యేకత. అనంతపురం వంటి అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో సైతం నేడు పచ్చదనం కనిపిస్తుంది అంటే అది ఆయన వేసిన పునాదే.హంద్రీ – నీవా సుజల స్రవంతి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాయలసీమలోని ఎత్తైన ప్రాంతాలకు నీటిని పంపింగ్ చేయడం దీని ప్రత్యేకత. ఎన్టీఆర్ ఈ బృహత్తర పథకానికి పునాది వేశారు.అనంతపురం, కడప మరియు చిత్తూరు జిల్లాల మీదుగా దాదాపు 700 కిలోమీటర్లుఈ కాలువ సాగుతుంది. సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, కుప్పం వరకు కృష్ణా జలాలను తరలిస్తున్నది.

రాయలసీమలోని మెట్ట ప్రాంతాల దాహార్తిని తీర్చడానికి ఎన్టీఆర్ రూపొందించిన మరో అద్భుత ప్రాజెక్టు గాలేరు-నగరి. సుమారు 3.25 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు చిత్తూరు, కడప జిల్లాలలో వందలాది గ్రామాలకు తాగునీరు అందించేలా దీనిని రూపొందించారు. తాగునీటి భరోసా ఇవ్వడం. వరద నీటిని వృథాగా పోనివ్వకుండా, నిల్వ చేసుకునేలా రిజర్వాయర్ల అనుసంధానాన్ని ఆయన ప్రతిపాదించారు. నేడు ఈ ప్రాజెక్టు ద్వారా గండికోట, చిత్రవతి వంటి రిజర్వాయర్లు నిండుకుండల్లా మారుతుండటం సీమ రైతుల అదృష్టం.రాజకీయాల్లో ప్రాజెక్టులంటే కేవలం శంకుస్థాపనలు మాత్రమే అనుకునే కాలంలో, నిధుల కొరత ఉన్నా చిత్తశుద్ధితో పనులు మొదలుపెట్టిన ఘనత ఎన్టీఆర్ దే. గాలేరు – నగరి సుజల స్రవంతి రాయలసీమలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు నీరు చేర్చాలనే తపనతో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. కృష్ణా నది వరద జలాలను మళ్లించి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం. ఈ ప్రాజెక్టు ద్వారా కడప జిల్లాలో గండికోట లాంటి భారీ రిజర్వాయర్లకు నీటిని తరలించి అక్కడి నుండి కాలువల ద్వారా సాగునీరు అందించేలా ప్రణాళిక వేశారు ఎన్టీఆర్.

తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీఆర్ పరిపాలనా దక్షతకు ఒక మచ్చుతుక. ఈ ప్రాజెక్టు కేవలం సాగునీటికే కాకుండా, పొరుగు రాష్ట్రమైన తమిళనాడుతో స్నేహహస్తానికి ప్రతీకగా నిలిచింది.ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించడం.తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న చెన్నై నగరానికి తాగునీరు అందించడం.శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలను తరలించి దాదాపు 5.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, రాయలసీమ గడ్డపై కృష్ణామ్మ పరవళ్లు తొక్కేలా చేసారు.ఎన్టీఆర్ ఆలోచనల నుంచే పుట్టిన మూడు మహా సంకల్పాలు తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి.రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చాలనే సంకల్పంతో ఆయన రూపకల్పన చేసిన ప్రాజెక్టులు నేడు ఆ ప్రాంతానికి జీవనాడులు అయ్యాయి అని చెప్పాలి.
నా తెలుగు జాతి గర్వపడాలి,నా సీమ రైతు కళ్లల్లో ఆనందం చూడాలి అన్న ఎన్టీఆర్ తపనే ఈ ప్రాజెక్టుల రూపంలో రాయల సీమలో నేడు ప్రవహిస్తోన్న ఆ జలధారలు కేవలం కాలువలు కావు, సీమ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలు అని చెప్పాలి.

Releated Posts

మహిళల సాధికారతకు ఎన్టీఆర్ చూపిన దారి మహిళలకు బలం ఇచ్చిన ఐదు కీలక నిర్ణయాలు

మహిళ అంటే కేవలం కుటుంబాన్ని నడిపించే వ్యక్తి మాత్రమే కాదు.ఆమె ఒక కుటుంబానికి బలం… సమాజానికి దిశ చూపే శక్తి. ఒక సమాజం నిజంగా…

Mar 9, 2026

The Path Shown by NTR for Women’s Empowerment Five Key Decisions that Strengthened Women

A woman is not just someone who manages a family.She is the strength of a household and a…

Mar 9, 2026

ఎన్టీఆర్ vs అప్పటి రాజకీయ వ్యవస్థ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విప్లవం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయాలు అంటే ఒకే పార్టీ ఆధిపత్యం, ఒకే విధమైన పాలన అనే భావన ఉండేది. ప్రభుత్వాలు మారినా వ్యవస్థ మాత్రం…

Mar 6, 2026

N.T. Rama Rao vs the Political Establishment: A Turning Point in Andhra Pradesh Politics

For a long time, politics in Andhra Pradesh was defined by the dominance of a single political force…

Mar 6, 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *