Nandamuri Taraka Rama Rao – శాశ్వత కీర్తి, తెలుగు గర్వానికి నిలువెత్తు ప్రతీక

తెలుగు అని గట్టిగా పలికితే… ఆ శబ్దానికి బలం తెచ్చిన నాయకుడు మన ఎన్టీఆర్ గారు.
ఆయన పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒకే పదం

@ ఆత్మగౌరవం

సినిమాల్లో ఆయన స్టార్ మాత్రమే కాదు, ఒక సంస్కృతి.
రాజకీయాల్లో ఆయన నాయకుడు మాత్రమే కాదు, ఒక ఉద్యమం.

తెలుగు దేశం .ఒక పార్టీ కాదు, ఒక గౌరవ ప్రకటన

1982లో Telugu Desam Party ప్రారంభమైనప్పుడు అది సాధారణ రాజకీయ నిర్ణయం కాదు.
అది ఒక స్పష్టమైన సందేశం
“తెలుగు వాడికి తన గౌరవం ఉంది.”

దిల్లీ రాజకీయాల్లో ప్రాంతీయ స్వరాలు పెద్దగా వినిపించని కాలంలో
“తెలుగు” అనే పదాన్ని దేశం మొత్తం వినిపించేట్టు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారే.

ఆయన చెప్పిన మాటలు స్లోగన్లు కాదు.
అవి మనలో ధైర్యం నింపిన మాటలు.
మనమూ మనమే అనే నమ్మకం ఇచ్చిన మాటలు.

తెలుగు నాడు మన అస్థిత్వం

ఈరోజు “తెలుగు నాడు” అనే పదం మళ్లీ చర్చలోకి వస్తోంది.
పేరు మారాలి? వద్దా? అనేది రాజకీయ చర్చ.

కానీ అసలు విషయం ఏమిటంటే
తెలుగు నాడు అనేది మన భావం.

తెలుగు నాడు అంటే కేవలం భూభాగం కాదు.
మన సంస్కృతి.
మన పండుగలు.
మన భాష.
మన చరిత్ర.
మన ఐక్యత.

తెలుగు దేశం, తెలుగు నాడు, తెలుగు వాడు .ఇవన్నీ వేర్వేరు పదాల్లా కనిపించినా
మన గుండెల్లో ఇవి ఒక్కటే.

ఎన్టీఆర్ ఆశయం మన బాధ్యత

పార్టీలు మారవచ్చు.
రాజకీయ పరిస్థితులు మారవచ్చు.
కానీ తెలుగు గర్వం తగ్గకూడదు.

ఎన్టీఆర్ గారు చూపించిన దారి స్పష్టంగా ఉంది .
మన గౌరవం మన చేతుల్లోనే ఉండాలి.

తెలుగు వాడిగా గర్వపడటం తప్పు కాదు.
అది మన హక్కు.
అది మన బాధ్యత కూడా.

మనమంతా ఒకటే.
తెలుగు వాళ్లమంతా ఒకటే.
మన రక్తంలో తెలుగు ఉంది.
మన గుండెల్లో తెలుగు ఉంది.

ఈ భావన మన నరనరాల్లో నింపుకోవాలి.
అదే ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళి.

తెలుగు ఒక భాష కాదు ,ఒక భావం.
తెలుగు దేశం ఒక పార్టీ కాదు ఒక స్వాభిమానం.
తెలుగు నాడు ఒక పదం కాదు మన అస్థిత్వం.

మనమంతా తెలుగు వాళ్లమే.
మనమంతా ఒకటే.

తెలుగు దేశం.
తెలుగు నాడు.
తెలుగు గర్వం.

తెలుగు ఆత్మగౌరవం, సామాజిక చైతన్యం, ప్రజల సమస్యలు – ఇవే నా రచనల ప్రాణం.
తెలుగు సంస్కృతి, తెలుగు విలువలు, తెలుగు ఐక్యతపై నమ్మకం ఉన్న రచయితిని నేను.

నందమూరి తారక రామారావు గారి ఆశయాలు, తెలుగు గర్వం, సమాజంలో సానుకూల మార్పు తీసుకొచ్చే ఆలోచనలు ఇవి నా ప్రతి పదంలో ప్రతిధ్వనిస్తాయి.

తెలుగు వాడిగా గర్వపడే ప్రతి మనిషి హృదయంలో స్వాభిమానం మేల్కొలిపే ప్రయత్నమే నా రచన.

తులసి పద్మశ్రీ
మార్పు వెల్ఫేర్ సొసైటీ.

Releated Posts

మహిళల సాధికారతకు ఎన్టీఆర్ చూపిన దారి మహిళలకు బలం ఇచ్చిన ఐదు కీలక నిర్ణయాలు

మహిళ అంటే కేవలం కుటుంబాన్ని నడిపించే వ్యక్తి మాత్రమే కాదు.ఆమె ఒక కుటుంబానికి బలం… సమాజానికి దిశ చూపే శక్తి. ఒక సమాజం నిజంగా…

Mar 9, 2026

The Path Shown by NTR for Women’s Empowerment Five Key Decisions that Strengthened Women

A woman is not just someone who manages a family.She is the strength of a household and a…

Mar 9, 2026

ఎన్టీఆర్ vs అప్పటి రాజకీయ వ్యవస్థ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విప్లవం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయాలు అంటే ఒకే పార్టీ ఆధిపత్యం, ఒకే విధమైన పాలన అనే భావన ఉండేది. ప్రభుత్వాలు మారినా వ్యవస్థ మాత్రం…

Mar 6, 2026

N.T. Rama Rao vs the Political Establishment: A Turning Point in Andhra Pradesh Politics

For a long time, politics in Andhra Pradesh was defined by the dominance of a single political force…

Mar 6, 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *