ఎన్ టి ఆర్ రూ 30 పింఛను పథకం విప్లవాత్మక ఆలోచన!

సామాజిక సంక్షేమంలో కొత్త యుగానికి శ్రీకారం చుట్టిన ఎన్ టి ఆర్ నిర్ణయం తర్వాత భారతదేశంలో సంక్షేమ పథకాల ఆలోచనే మారిపోయింది.దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ అందించాలనే ఆలోచన చేసిన మొదటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.ఆయన ప్రవేశపెట్టిన రూ 30 పెన్షన్ పథకం కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు. అది సమాజంలో అణగారిన వర్గాల పట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమకు,మానవత్వానికి నిదర్శనం.భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత, పాలన అంటే కేవలం ఫైళ్లు చూడటం కాదు.పేదల కన్నీళ్లు తుడవడమని నిరూపించిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు. సమాజంలో ఎవరైతే తమ ఉనికిని కోల్పోయి, ఆదరణ కరువై, నిరాశలో ఉన్నారో వారికి నేనున్నాను అని భరోసా కల్పిస్తూ ఆయన ప్రవేశపెట్టిన 30 రూపాయలు పెన్షన్ పథకం ఒక సామాజిక విప్లవం.


1983లోఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సామాజిక స్థితిగతులు అద్వాన్నంగా ఉండేవి.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది.ఆ కాలంలో పేదరికం తాండవిస్తున్న తరుణంలో, రెక్కాడితే గానీ డొక్కాడని వృద్ధులు పని చేయలేక, సరైన తిండి లేక ఇబ్బందులు పడేవారు. అప్పట్లో 30 రూపాయలు అంటే ఒక నెలకు సరిపడా కనీస రేషన్ ముఖ్యంగా కిలో 2 రూపాయల బియ్యం కొనుక్కోవడానికి సరిపోయేవి.ఇది వృద్ధులలో నేను ఎవరికీ భారం కాను అనే ధైర్యాన్ని నింపింది. వారికి 30 రూపాయలు చేతిలో పడితే వృద్ధుల ముఖంలోఎంతో ఆనందం కనిపించేది.ఆనాడు కేవలం 30 రూపాయలు అంటే నేటి కాలానికి తక్కువగా అనిపించవచ్చు. కానీ ముసలితనంలో ఎవరికీ భారం కాకూడదనే వృద్ధుల ఆకాంక్షను ఈ పథకం గౌరవించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పేదల కోసం సామాజిక భద్రతను ఒక హక్కుగా మార్చిన ఘనత ఎన్టీఆర్‌ది.ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకం కేవలం ఒక ఆర్ధిక సాయం మాత్రమే కాదు, ఆకలితో ఉన్న పేదవాడి కన్నీరు తుడిచిన ఒక గొప్ప మానవీయ సంకల్పం.రూ 30 రూపాయలు అనేది కేవలం అంకె మాత్రమే కాదు. ఒక వృద్ధుడి ఆత్మగౌరవం, ఒక వితంతువు ధైర్యం, ఒక వికలాంగుడి కి భరోసా. ఈ పథకం వెనుక ఉన్న ఉన్నతమైన ఆశయాలు అవే. కొడుకులు, కోడళ్ల మీద ఆధారపడకుండా, తన మందులకో ఏమైనా అవసరాలకో ఎవరినీ చేయి చాచకుండా ఉండాలన్నదే అన్నఎన్ టి ఆర్ ముఖ్య ఉద్దేశ్యం.సమాజంలో అత్యంత వెనుకబడిన వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వమే ఒక పెద్ద కొడుకులా అండగా ఉండాలని ఆయన భావించి ప్రభుత్వ ధనం ప్రజల సొత్తు, అది తిరిగి ప్రజలకే చేరాలి అన్న సూత్రంతో సంక్షేమ రాజ్య స్థాపనకు ఎన్ టి ఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.


దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ అందించాలనే ఆలోచన చేసిన మొదటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. అప్పట్లో ఈ పథకం గురించి విని దేశమంతా ఆశ్చర్యపోయింది.రూ 2 కే కిలో బియ్యం ఇవ్వడమే కాకుండా, ఆ బియ్యం కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు కూడా ఉండాలని ఆయన పెన్షన్లను పధకాన్ని ప్రవేశపెట్టారు.సమాజమే దేవాలయం -ప్రజలే దేవుళ్లు అని నమ్మిన నాయకుడు కాబట్టే, ఆ దేవుళ్ల సేవలో భాగంగా ఈ భరోసా కల్పించారు. భారతదేశంలో అంతకుముందు పింఛన్లు అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం. కానీ ప్రభుత్వ ఖజానాపై మొదటి హక్కు పేదవాడిదే అని చాటిచెబుతూ, సామాన్య పౌరుడికి కూడా పింఛను పొందే హక్కు ఉందని ఎన్టీఆర్ నిరూపించారు.నేడు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నపింఛన్లు రూ.2016 నుండి రూ. 4,000,వికలాంగులకు రూ 6000 పింఛన్లు అందిస్తున్నారు.1983 రూ.30 తర్వాతి కాలంలో: రూ. 75, రూ. 200, రూ.1000-2000- 3000 -4000 ఇలా పెరుగుతూ వచ్చింది.నేడు ప్రభుత్వాలు ఇస్తున్న వేల రూపాయల పెన్షన్లకు పునాది 40 ఏళ్ల నాడు ఎన్ టి ఆర్ వేసిన ఆ 30 రూపాయల పెన్షన్ పథకమే.చిన్న మొక్క మహావృక్షమై కోట్లాది మందికి నీడను ఇస్తున్నట్లు,ఎన్ టి ఆర్ ఆలోచన కూడా నేడు దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలకు రోల్ మోడల్‌గా నిలవడం గర్వకారణం.అధికారం అంటే అహంకారం కాదు, అణగారిన వర్గాల సేవ అని చాటిచెప్పిన మహా నాయకుడు ఎన్టీఆర్ .30 రూపాయలపెన్షన్ పథకం ద్వారా లక్షలాది మంది పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు.ఎన్టీఆర్ 30 రూపాయల పింఛను పథకం సేవా యజ్ఞంలో భాగంగా ఉద్భవించిన ఒక విప్లవాత్మక ఆలోచన.

Releated Posts

మహిళల సాధికారతకు ఎన్టీఆర్ చూపిన దారి మహిళలకు బలం ఇచ్చిన ఐదు కీలక నిర్ణయాలు

మహిళ అంటే కేవలం కుటుంబాన్ని నడిపించే వ్యక్తి మాత్రమే కాదు.ఆమె ఒక కుటుంబానికి బలం… సమాజానికి దిశ చూపే శక్తి. ఒక సమాజం నిజంగా…

Mar 9, 2026

The Path Shown by NTR for Women’s Empowerment Five Key Decisions that Strengthened Women

A woman is not just someone who manages a family.She is the strength of a household and a…

Mar 9, 2026

ఎన్టీఆర్ vs అప్పటి రాజకీయ వ్యవస్థ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విప్లవం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయాలు అంటే ఒకే పార్టీ ఆధిపత్యం, ఒకే విధమైన పాలన అనే భావన ఉండేది. ప్రభుత్వాలు మారినా వ్యవస్థ మాత్రం…

Mar 6, 2026

N.T. Rama Rao vs the Political Establishment: A Turning Point in Andhra Pradesh Politics

For a long time, politics in Andhra Pradesh was defined by the dominance of a single political force…

Mar 6, 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *